ప్రకాశం జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి షాలిన్ రాజు(5) అనే బాలుడు మృతిచెందాడు. ఇంటిపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగలడంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.