ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర | Chhattisgarh landmine blast | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

Nov 6 2014 3:00 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు.

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పాములవయ్యా గ్రామం వద్ద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు బుధవారం పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సీఆర్‌పీఎఫ్ బలగాలు 70 మంది గంగులూరు నుంచి అటవీ ప్రాంతానికి కూంబింగ్‌కు బయలుదేరారు. ఈ రహదారి నుంచి బస్సులో పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చడానికి పథకం రచించారు. అయితే, పోలీసుల బస్సు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు  20 నిమిషాల ముందుగానే పేలింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement