అర్బన్ ఎస్పీ తీరుపై చెవిరెడ్డి మండిపాటు | chevireddy bhaskar reddy takes on urban sp | Sakshi
Sakshi News home page

అర్బన్ ఎస్పీ తీరుపై చెవిరెడ్డి మండిపాటు

Jul 15 2014 3:53 PM | Updated on Aug 13 2018 4:11 PM

తిరుపతి అర్బన్‌ ఎస్పీ రాజశేఖరబాబు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

తిరుపతి అర్బన్‌ ఎస్పీ రాజశేఖరబాబు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రొటోకాల్ విషయంలో వారం క్రితం తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాలను ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈనాడు పత్రికకు లీక్ చేశారని, తన పరువుకు భంగం కలిగించినందున ఎస్పీపై తాను పరువునష్టం దావా దాఖలు చేశానని ఆయన చెప్పారు.

అయితే, వారం రోజుల క్రితం తాను రాసిన లేఖకు అర్బన్ ఎస్పీ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తన లేఖపై ఎస్పీ స్పందించాలని చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement