'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ' | chandrababu name should add as a1 in revanth case | Sakshi
Sakshi News home page

'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ'

Jun 3 2015 6:22 PM | Updated on Oct 30 2018 5:17 PM

'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ' - Sakshi

'అడ్డంగా దొరికినా..దుష్ప్రచారం ఆపవా బాబూ'

రేవంత్ వ్యవహారంలో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, వెంకటరమణ, అంజాద్ బాషా లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గుంటూరు: రేవంత్ వ్యవహారంలో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, వెంకటరమణ, అంజాద్ బాషాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన సమర దీక్షలో ఎమ్మెల్యేలు బుధవారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తో కుమ్మక్కైంది మేము కాదు.. 2009 ఎన్నికల్లో మహాకూటమి అంటూ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది నువ్వు కాదా చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని టి.హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే చంద్రబాబును A-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement