'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం! | Chandrababu Naidu yells on farmer as "useless fellow" | Sakshi
Sakshi News home page

'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం!

Aug 8 2014 6:32 PM | Updated on Oct 1 2018 2:44 PM

'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం! - Sakshi

'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం!

రుణమాఫీ గురించి నిలదీసిన రైతుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ గురించి నిలదీసిన రైతుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఎప్పుడంటూ ఓ రైతు ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు 'ఏయ్ యూజ్ లెస్ ఫెలో..ముందు విను అంటూ కసురుకున్నారు. ముందు విను. ఒక్కరు అరిస్తే సమస్య పరిష్కారం కాదు. పదిమంది మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ హెచ్చరించే ధోరణిలో చంద్రబాబు స్పందించడంతో రైతులు అవాక్కయ్యారు. 
 
చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేశ్ బాబు వ్యవహారం మరోలా ఉంది. రైతు రుణమాఫీ గురించి అడిగిన ప్రశ్నకు మీడియాపై రుసరుసలాడారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారం.. రైతు రుణమాఫీ గురించి తనకు సంబంధం లేదని లోకేశ్ తప్పించుకోవడానికి చూశారు. రుణమాఫీ ఎప్పడవుతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు చంద్రబాబు తాజా హెచ్చరికలు అయోమయానికి గురిచేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement