19న చంద్రబాబు అధికారిక గృహప్రవేశం | Chandrababu Naidu will enter into Lakeview Guest House on 19th | Sakshi
Sakshi News home page

19న చంద్రబాబు అధికారిక గృహప్రవేశం

Jun 15 2014 2:59 PM | Updated on Sep 2 2017 8:51 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేది గురువారం ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేది గురువారం  ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించనున్నారు. అనంతరం అక్కడి నుంచే ఆయన శాసనసభకు వెళతారు.  రాష్ట్ర విభజన నేపధ్యంలో అధికారికి భవనాలను కూడా విభజించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా  లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఏపి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడ నుంచే చంద్రబాబు పరిపాలన సాగిస్తారు. ఆయన అధికార నివాసం కూడా ఇదే.

దీనిని ఏపి సిఎంకు కేటాయించిన   నేపథ్యంలో ఈ అతిథి గృహం మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.  ఇంటెలిజెన్స్‌ విభాగం సూచనల మేరకు రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement