రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలుపుకోవాలని
శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలుపుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ మహిళలపై తెలుగుదేశం పార్టీ దాష్టీకం ప్రదర్శించిన తీరు ఎన్నడూ క్షమించరానిదన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అమలు చేయలేక వాయిదాలుగా మహిళలకు మోసం చేస్తున్నారని వివరించారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం చేసి వారిని వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలు కడుపు మండి గోడు వినిపించుకోవడానికి శాంతియుతంగా ముందుకు వస్తే వారికి లాఠీచార్జీలతో, అరెస్టులతో మహిళలను హింసిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తలకు మేలు చేయాలని ఆమె కోరారు. మహిళల తరపున, అంగన్‌వాడీ కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు, వీఆర్‌ఏలకు మధ్యాహ్న భోజన కార్మికులకు మద్దతుగా పోరాడతామని ఆమె తెలిపారు.