రాష్ట్రంలో దుష్టపాలన | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దుష్టపాలన

Nov 30 2014 1:34 AM | Updated on Jul 25 2018 4:07 PM

రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పరిపాలన నుంచి పేద ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలన్న ఆలోచనలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,

కామవరపుకోట : రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పరిపాలన నుంచి పేద ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలన్న ఆలోచనలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తాను ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని అన్నారు. స్థానిక కార్యకర్త కిలారు సత్యనారాయణ ఇంటి ఆవరణలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన   హాజరయ్యారు. ఈ సందర్భగా మాట్లాడుతూ ైరె తు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు.ఆధార్ వ్యవస్థ అన్యాయమని పోరాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి పథకానికి ఆధార్ కావాలంటూ ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు.
 
 రుణాలను ఎలా రద్దు చేస్తారు?
 ఎర్రచందనం అమ్మితే వచ్చే రూ.ఐదు వేల కోట్లు, కార్పొరేషన్‌లో జమ చేసిన రూ.ఐదువేల కోట్లు మొత్తం రూ. పదివేల కోట్లతో రూ.లక్షా ఎనిమిది వేల కోట్ల రుణాలను ఎలా రద్దు చేస్తారని నాని ప్రశ్నించారు. మహిళల రుణాల పై ఒక్కమాట కూడా మాట్లాడని దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ధర్నాలు చేస్తున్న టీడీపీ శ్రేణులకు ఎన్నికల హామీలు అమలు చేసి పార్టీ పరువు కాపాడాలని ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆందోళన చేపట్టాల్సిందిగా ఎంపీ మాగంటి బాబు, మంత్రి సుజాత హితవు చెప్పాలన్నారు. వచ్చే నెల 5న ఏలూరులో జరిగే రైతు ధర్నాలో రైతులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్, ఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పథకాలకే టీడీపీ నాయకులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు.
 
 మరో కన్వీనర్ మద్దాల రాజేష్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మండల కన్వీనర్ మిడతా రమేష్ మాట్లాడుతూ చక్కగా నడుస్తున్న ఘంటా హనుమంతరావు ఎర్రకాల్వ ఎత్తిపోతల పథకాన్ని రాజకీయ కారణాలతో పాడు చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వాటిని అడ్డుకోవాలని నాని దృష్టికి తీసుకువచ్చారు. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ వందనపు సాయిబాల పద్మజ, ఏఎంసీ చైర్మన్ తూతా లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు చిలుకూరి సుబ్బారావు, ఎర్రకాల్వ ఎత్తిపోతల పథకం చైర్మన్ కంఠమనేని సత్యనారాయణ, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.బాలస్వామి, వై శ్రీను పాల్గొన్నారు.
 
 ఇన్ని ఆంక్షలా?
 లింగపాలెం : ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీని అమలు చేసేందుకు ఆరు నెలలుగా ఇన్ని ఆంక్షలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. శనివారం రాత్రి లింగపాలెం మండలం భోగోలులో పార్టీ నాయకుడు దయ్యాల నవీన్‌బాబు ఇంటి ఆవరణలో నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతసేపు రేషన్‌కార్డు, మరికాసేపు ఆధార్‌కార్డు తీసుకురమ్మని, తరువాత బంగారానికి లేదు, పంట రుణాలకే అంటున్న చంద్రబాబు రాను రాను తెల్ల పంచె ధరించి, మెడలో తెల్లకండువా వేసుకునేవారికే రుణమాఫీ చేస్తానని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.  
 
 కార్యకర్తల జోలికొస్తే ఎదుర్కొంటాం
 చింతలపూడి :  టీడీపీ అధికార బలంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ నాని హెచ్చరించారు. చింతలపూడి వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల సమావేశం శనివారం మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు గృహం వద్ద జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని ప్రసంగిస్తూ జిల్లాలో కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, అధైర్య పడవద్దన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కంక ణబద్ధులు కావాలని చెప్పారు. మరో కోఆర్డినేటర్ ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టి పబ్బం గడుపుకుందామని టీడీపీ చూస్తోందని విమర్శించారు. అంతకుముందు పలువురు కార్యకర్తల నుంచి అభిప్రాయాలను నాని సేకరించారు. టీపీ గూడెం మాజీ జెడ్పీటీసీ ఎం. సంపత్‌కుమార్, సర్పంచ్ మారిశెట్టి జగన్, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ గంధం చంటి, మండలంలోని సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.
 
 ప్రజలను మోసగించి బాబు గద్దెనెక్కారు
 జంగారెడ్డిగూడెం రూరల్ : అమలు కాని హామీలు ఇచ్చి రైతులను, మహిళలను మోసం చేసి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా  అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మండల స్థాయి సమావేశం పేరంపేట పార్టీ నాయకులు ఇర్ల శ్రీనివాసరెడ్డి బ్యారన్ గ్రౌండ్‌లో  నిర్వహించారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఈ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తే రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు  మళ్లీ మాట తప్పి పంట రుణాలు చేస్తానని,  పామాయిల్,  కొబ్బరి, అరటి తోటలు తనకు సంబంధం లేదని పొంతన లేకుండా మాట్లాడుతూ రైతులను  ఇంకా మోసం చేస్తున్నారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement