బాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి | Chandra babu's tour is cheating telangana people | Sakshi
Sakshi News home page

బాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి

Sep 2 2013 1:40 PM | Updated on Jul 28 2018 6:33 PM

బాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి - Sakshi

బాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే... ఊసరవెల్లులు సైతం సిగ్గుపడతాయని టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు అన్నారు.


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే... ఊసరవెల్లులు సైతం సిగ్గుపడతాయని టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు అన్నారు. ప్రజలంతా రోడ్లమీదికి వస్తే తాను ఇంట్లో కూర్చుంటానా అంటున్న చంద్రబాబు అప్పుడు సకల జనుల సమ్మె సమయంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వస్తే ఎందుకు స్పందించ లేదని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు. ఇన్నిసార్లు మాట మార్చే నేత దేశంలోనే ఎవరూలేరని హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల బాధలు తెలుగు ప్రజలవి కావా అని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతుంది చంద్రబాబు నాయుడే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర ఉద్దేశం చెప్పకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. విభజన లేఖ ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తారా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి గుంటూరు జిల్లా నుంచి ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement