ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం: ద్వివేది

CEO Gopalakrishna Dwivedi Visits Tirumala Tirupati - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ద్వివేది మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళలు, వికలాంగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పోలింగ్‌లో ఏపీ రెండో స్థానాంలో నిలిచిందని ప్రకటించారు. కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయించాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. కేవలం రెండు శాతానికి మించి ఈవీఎంలు మొరాయించలేదని.. వీలైనంత త్వరలోనే వాటిని కూడా మరమత్తులు చేయించామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగే సహరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top