జగన్ హాజరు మినహాయింపునకు కోర్టు నో | cbi court rejects jagan plea | Sakshi
Sakshi News home page

జగన్ హాజరు మినహాయింపునకు కోర్టు నో

Feb 5 2014 1:39 AM | Updated on Jul 25 2018 4:07 PM

తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిస్తూ తన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టులో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న స్పెషల్ వకాలత్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం కొట్టివేసింది.

సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిస్తూ తన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టులో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న స్పెషల్ వకాలత్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో జగన్ హాజరు తప్పనిసరని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్వరలోనే సాధారణ ఎన్నికల దృష్ట్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఈ తరుణంలో తన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును ఈ పిటిషన్‌లో అభ్యర్థించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement