సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్‌  | Call Center To Deliver Welfare Schemes To The Poor People - Kethireddy | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకం అందలేదా..?

Jun 21 2019 7:59 AM | Updated on Jun 21 2019 8:16 AM

Call Center To Deliver Welfare Schemes To The Poor People - Kethireddy - Sakshi

కాల్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  

సాక్షి, ధర్మవరం: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం, అవినీతి నిర్మూలన కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులకు అందించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య అయినా, ఏ సంక్షేమ పథకం అందకపోయినా 94931 56565 నంబర్‌ను ఫోన్‌ చేయవచ్చన్నారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు 100 శాతం అందించాలన్న తలంపుతో ముందుకు పోతున్నామన్నారు. ఇందులో భాగంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందించేందుకు ఎవరైనా లంచం అడిగినా, బెదిరించినా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement