'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు' | Cadre should not come to KCR's oath: Karne Prabhakar | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు'

May 30 2014 7:36 PM | Updated on Aug 15 2018 9:20 PM

'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు' - Sakshi

'కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు రావొద్దు'

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఆపార్టీ నేత కర్నె ప్రభాకర్ సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ఆపార్టీ నేత కర్నె ప్రభాకర్ సూచించారు. జూన్ 1 తేది అర్ధరాత్రి 12గం.లకు ట్యాంక్‌బండ్‌, నెక్లస్‌ రోడ్,  పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. 
 
జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని.. జూన్1, 2 తేధీల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని కర్నె ప్రభాకర్ తెలిపారు. జూన్ 2న తెలంగాణలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాతోపాటు,  టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement