రైల్వే ఉద్యోగుల బోనస్‌కు కేబినెట్ పచ్చజెండా | Cabinet green signal to Railway employees bonus | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగుల బోనస్‌కు కేబినెట్ పచ్చజెండా

Oct 4 2013 1:25 AM | Updated on Oct 17 2018 5:10 PM

రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 2012-13కుగానూ రైల్వేశాఖలో అర్హులైన అందరు ఎన్జీవోలకు(సుమారు 12.37 లక్షల మంది) 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలన్న రైల్వేశాఖ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 2012-13కుగానూ రైల్వేశాఖలో అర్హులైన అందరు ఎన్జీవోలకు(సుమారు 12.37 లక్షల మంది) 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలన్న రైల్వేశాఖ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది. దసరా ముందు ఉత్పాదకత ఆధారిత బోనస్ ప్రకటించడం రైల్వేశాఖలో ఆనవాయితి. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.8975 రూపాయలు బోనస్‌గా ఇవ్వడం వల్ల  రైల్వేశాఖపై రూ.1043.43 కోట్ల భారం పడనుంది. మరోవైపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) 750 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా విధానంలో నాణ్యతను పెంచేందుకు ఉద్దేశించిన ‘రాష్ట్రీయ ఉచ్చ్‌తర్ శిక్షా అభియాన్’ పథకాన్ని కూడా ఆమోదించింది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ సమగ్ర టెక్స్‌టైల్స్ పార్క్ పథకాన్ని కొనసాగించే ప్రతిపాదనను కూడా ఆమోదించింది.

Advertisement
 
Advertisement
Advertisement