'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్' | C Ramachandraiah takes on AP CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్'

Nov 18 2014 11:19 AM | Updated on Mar 18 2019 7:55 PM

'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్' - Sakshi

'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్'

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటుపై సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటుపై సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. మంగళవారం విజయవాడలో సి.రామచంద్రయ్య మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం మెట్టప్రాంతాలను వదిలేసి పంటపొలాలను ఎంపిక చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్ ఆయన ఆరోపించారు. రాజధానిలో ఇప్పటికే కార్పొరేట్ మాఫియా దిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ మాఫియాకు లాభం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. అందుకోసం క్విడ్ ప్రో కోను ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందని సి.రామచంద్రయ్య  ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement