విద్యతో వ్యాపారం చేయరాదు | Business education should not be | Sakshi
Sakshi News home page

విద్యతో వ్యాపారం చేయరాదు

Oct 19 2014 4:09 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యతో వ్యాపారం చేయరాదని విముక్త చిరుతల కక్షి(వీకేసీ) జాతీయ అధ్యక్షుడు తిరుమా వలవన్ తెలిపారు. తిరుపతి ఇందిరా మైదానంలో శనివారం సాయంత్రం వి ద్యాహక్కుపై మహా సదస్సు జరిగింది.

తిరుచానూరు : విద్యతో వ్యాపారం  చేయరాదని విముక్త చిరుతల కక్షి(వీకేసీ) జాతీయ అధ్యక్షుడు తిరుమా వలవన్ తెలిపారు. తిరుపతి ఇందిరా మైదానంలో శనివారం సాయంత్రం వి ద్యాహక్కుపై మహా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తిరుమావలవన్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒకరికి విద్యను అందించేలా ఒకే రకమైన విద్యావిధానం అమలుచేయాలని డిమాండ్ చేశారు.

అన్ని ప్రైవేటు విద్యాసంస్థలను జాతీయం చేయాలని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒకరికి ఉచిత నిర్బంధ, ప్రాథమిక విద్యను అందించాలని, ప్రాథమిక విద్య నుంచి హైస్కూల్ విద్య వరకు మాతృభాషలోనే బోధించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ ఆదాయంలో మూ డో వం తు నిధులను విద్యారంగానికి కేటాయిం చాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకు ప్రతి ఒకరికి ప్రభుత్వమే ఉచితంగా విద్యనందించాల ని కోరారు. బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరం కావడం వలనే సమాజంలో వివక్షకు గురవుతున్నారని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.

సదస్సు జరిగేంత వరకు వర్షం వస్తునాన జనం లెక్కచేయకుండా తడుస్తూనే పాల్గొన్నారు. కార్యక్రమంలో వీసీకే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఏన్‌జే.విద్యాసాగర్, జిల్లా అధ్యక్షుడు బోకం రమేష్, నీలవానత్తు నెలవన్, రాష్ట్ర కార్యదర్శి పి.మురళీకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సునీల్‌కుమార్, గొల్లపల్లి అంబేద్కర్, కాంచన వేంగన్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎంఎం.వినోదిని, దళిత నాయకుడు పరమశివన్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement