
తణుకుటౌన్: తమకు వచ్చిన నోట్లను పదేపదే సరిచూసుకునే బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటును పెట్టేశారు. ఈ నోటు పట్టణంలోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బోడపాటి సత్యనారాయణకు మంగళవారం సాయంత్రం వచ్చింది. ఆయన రూ.15,000 ఉపసంహరణ చేయగా, అందులో ఓ రెండువేల నోటు కాలిపోయి ఉంది.
దీనిని బ్యాంకు అధికారులకు చూపించగా, తర్వాత మారుస్తామని చెప్పినట్టు సత్యనారాయణ వెల్లడించారు. సామాన్యుల నుంచి పెన్ను గీతలు, మరకలు ఉన్న నోట్లనే తీసుకోని బ్యాంకు అధికారులు ఇలా ఏటీఎంలలో కాలిన నోట్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.