breaking news
burnt note
-
సర్వం బుగ్గిపాలు
అలంపూర్ : అగ్ని ప్రమాదం ఒక పెళ్లింటిలో తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇంట్లో జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో కూతురికి ఇవ్వాల్సిన కట్నకానుకలు అగ్నిలో బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం బారినపడిన ఆ కుటుంబానికి చివరికి కట్టుబట్టలే మిగిలాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన ఉండవల్లి మండలం పుల్లూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నన్నూరు గ్రామానికి చెందిన సలాంఖాన్ కలుకోట్ల పీఏసీఎస్‌లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన గత 9 నెలలుగా పుల్లూరులో నాగరాజు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శనివారం రాత్రి రోజు మాదిరిగానే నిద్రిస్తుండగా రాత్రి సుమారు 12 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల వారు సలాంఖాన్ కుటుంబ సభ్యులను తలుపుతట్టి లేపారు. వారు తేరుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. తర్వాత చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. కానీ సకాలంలో అగ్నిమాపక కేంద్రం సహాయం అందకపోవడంతో కాలనీవాసుల ఇళ్లలోని నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో కూతురి పెళ్లి కోసం తెచ్చుకున్న దాదాపు రూ.5 లక్షల నగదు, రూ.3 లక్షల కానుకలు, దుస్తులు, 18 తులాల బంగారం, జీతం తాలుకు నగదు, వంట సామగ్రి, తిండి గింజలు, రోజువారి దుస్తులు, ఫర్నీచర్ అన్నీ అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఇన్సురెన్స్ బాండ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఉండవల్లి ఆర్ఐ సర్దార్భాషా అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు. కూతురి వివాహం కోసం.. సలాంఖాన్ కుమార్తెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఇందులో భాగంగా ఇరు కుటుంబాలు ఆదివారం కలిసి పెళ్లి ముమూర్తం ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో వివాహం పెట్టుకోనుండటంతో పెళ్లికి కావాల్సిన వస్తు వులు, దుస్తులు, బంగారం, నగదు సర్దుబాటు చేసుకున్నారు. కానీ షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంలో పెళ్లి కోసం తె చ్చిన వస్తువులు, బంగారం, నగదు, కానుకలు కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఆదుకోని అగ్నిమాపక వాహనం.. స్థానికంగా అగ్నిమాపక కేంద్రం లేక పోవడంతో ప్రమాద నష్టం భారీ స్థాయికి చేరుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన తక్షణమే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అం దించారు. గద్వాల, కర్నూలు రెండు ప్రాంతాలకు సమాచారం అందిం చినా ఫలితం లేకుండాపోయింది. అ దే సమీపంలో ఉండి ఉంటే ఇంత న ష్టం జరిగి ఉండేది కాదని బాధితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటు
తణుకుటౌన్: తమకు వచ్చిన నోట్లను పదేపదే సరిచూసుకునే బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో కాలిన రూ.2వేల నోటును పెట్టేశారు. ఈ నోటు పట్టణంలోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు బోడపాటి సత్యనారాయణకు మంగళవారం సాయంత్రం వచ్చింది. ఆయన రూ.15,000 ఉపసంహరణ చేయగా, అందులో ఓ రెండువేల నోటు కాలిపోయి ఉంది. దీనిని బ్యాంకు అధికారులకు చూపించగా, తర్వాత మారుస్తామని చెప్పినట్టు సత్యనారాయణ వెల్లడించారు. సామాన్యుల నుంచి పెన్ను గీతలు, మరకలు ఉన్న నోట్లనే తీసుకోని బ్యాంకు అధికారులు ఇలా ఏటీఎంలలో కాలిన నోట్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏటీఎంలో కాలిన నోటు
ముత్తారం(కరీంనగర్ జిల్లా): ముత్తారం మండలం కేశనపల్లిలో ఓ ఏటీఎం నుంచి కాలిన వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మండల కేంద్రానికి చెందిన అమ్ముకుమార్ ఏటీఎం నుంచి శుక్రవారం రెండు వందలు డ్రా చేయగా ఒక వంద నోటు మధ్యలో రెండు ప్రదేశాల్లో కాలిపోయి ఉంది. దీనిపైన సంబంధిత అధికారులను సంప్రదించగా పట్టించుకోవడం లేదని బాధితుడు తెలిపాడు.