చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని చంద్రగిరి పట్టణంలోని విజయనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున దొంగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. వారి నుంచి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో సునీల్, మునిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(చంద్రగిరి)