అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు.
అనంతపురం (గుంతకల్లు) : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫాం మీద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.