విద్యుదాఘాతం.. సోదరుల మృతి | brothers died due to short circuit | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం.. సోదరుల మృతి

Jan 27 2016 8:02 AM | Updated on Jun 1 2018 8:52 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు సోదరులు మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముదిగుబ్బ (అనంతపురం): విద్యుదాఘాతంతో ఇద్దరు సోదరులు మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోదరులు నర్సింహులు, తిమ్మప్ప మంగళవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లారు.

ముందుగా ఒకరు మోటార్ అన్ చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి లోనై కేకలు వేయగా... కాపాడే ప్రయత్నంలో రెండో వ్యక్తి కూడా షాక్‌కు గురై మృతి చెందారు. ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయి కనిపించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement