స్వర్ణముఖి నదిలో బాలుడి గల్లంతు | Boy drowns in Swarnamukhi river | Sakshi
Sakshi News home page

స్వర్ణముఖి నదిలో బాలుడి గల్లంతు

Dec 28 2015 7:02 PM | Updated on Jul 12 2019 3:02 PM

తిరుచానూరు మండలం యోగిమల్లవరం గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో సోమవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు.

తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : తిరుచానూరు మండలం యోగిమల్లవరం గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో సోమవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. యోగిమల్లవరం గ్రామానికి చెందిన బాలాజీ(13) అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ ఇంటర్వెల్ సమయంలో గ్రామానికి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ జారిపడి మునిగిపోయాడు. బాలుడి కోసం అధికారులు, గ్రామస్తులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement