శంషాబాద్ ఎయిర్పోర్టు పేల్చేస్తామని ఫోన్ కాల్ | Bomb Scare in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టు పేల్చేస్తామని ఫోన్ కాల్

Dec 19 2013 11:54 AM | Updated on Sep 2 2017 1:46 AM

శంషాబాద్ విమానాశ్రయానికి ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ గురువారం కలకలం సృష్టించింది.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ గురువారం కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టును పేల్చివేస్తామని రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్కాల్ వచ్చింది. అప్రమత్తం అయిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలను  నిర్వహించారు. మరోవైపు ఫోన్ కాల్పై అధికారులు ఆరా తీయగా, అమెరికా నుంచి దుండగుడు ఆ కాల్ చేసినట్లు గుర్తించారు. సోదాల అనంతరం అది నకిలీ ఫోన్ కాల్గా గుర్తించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement