‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’

BJP AP Leader Kanna Lakshmi Narayana Speak State convention - Sakshi

బీజేపీ పదాధికారుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ 

సాక్షి, విజయవాడ: ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం కప్పి పుచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు,కార్యకర్తలు బీజేపీలోకి చేరుతున్నారన్నారు.మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాక వాస్తవాలు గ్రహించి  పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. కశ్మీర్‌ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన ఘనత మోదీకే  దక్కుతుందన్నారు. దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో..ఆగస్టు 5,6 తేదీలకు కూడా అంతే ప్రత్యేకత ఉందన్నారు.370 ఏ,35ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించామని  తెలిపారు. ఈ నెల 20 వరుకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ కొనసాగుతుందని పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరణ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, బీజేపీ  నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top