'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే' | Bhumana Karunakar Reddy takes on congress party | Sakshi
Sakshi News home page

'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే'

Dec 16 2013 7:09 PM | Updated on Jul 29 2019 5:31 PM

'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే' - Sakshi

'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే'

రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్:రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అసలు తెలంగాణ బిల్లు ఇక్కడ వరకూ రావడానికి కారణ మాత్రం సీఎం అనే విషయం అందరికీ అవగతం అయ్యిందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చించే అంశాన్ని అడ్డుకున్న అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులే విభజన ద్రోహులని భూమన మండిపడ్డారు. సీమాంధ్రులు గొంతు కోసేలా విభజన బిల్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న డ్రామను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రక్తి కట్టిస్తున్నారన్నారు.

 

అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారని భూమన తెలిపారు. ఇంతటి కీలకమైన బిల్లు అంశాన్ని డిప్యూటీ స్పీకర్తో చర్చకు అనుమతి ఇప్పించడం హేయమైన చర్యని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement