భూమా నాగిరెడ్డి లొంగుబాటు | Bhooma Nagireddy surrenders to police | Sakshi
Sakshi News home page

భూమా నాగిరెడ్డి లొంగుబాటు

Nov 1 2014 2:49 PM | Updated on May 29 2018 4:15 PM

భూమా నాగిరెడ్డి లొంగుబాటు - Sakshi

భూమా నాగిరెడ్డి లొంగుబాటు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు.

కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు.  ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు.


కాగా భూమా నాగిరెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు  ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాం, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ  డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement