స్నేహితుల మాటలు నమ్మి.. | Sakshi
Sakshi News home page

స్నేహితుల మాటలు నమ్మి..

Published Mon, Oct 7 2013 2:23 AM

Believing the words of friends ..

ఔను.. తొలి అడుగే తడబడింది. తాను ఎంచుకున్న మార్గం ఎంత చెడ్డదో ఆదిలోనే అనుభవంలోకి వచ్చింది. తొందరగా డబ్బు సంపాదించేందుకు స్నేహితులు సూచించిన మార్గాన్ని ఎంచుకుని.. అంతలోనే పోలీసులకు చిక్కిన వైనమిది.     

- న్యూస్‌లైన్, చిన్నమండెం
 
 రాయచోటి లోని రాయుడు కాలనీకి చెందిన షేక్ ఇమ్రాన్ కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఎన్నాళ్లైనా అవే కట్టలు కొట్టడం, అమ్మడం వల్ల జీవితంలో మార్పేమీ లేదు. దీంతో కొందరు స్నేహితులు ఇచ్చిన ఉచిత సలహాలు అతనిలో ఆలోచనను రేకెత్తించాయి. ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా చేసి బెంగళూరులో అమ్మితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బుల సంపాదించొచ్చన్న విషయం తెలియగానే అటువైపు దృష్టి సారించాడు ఇమ్రాన్.
 
 పట్టుబడింది ఇలా...
 సుండుపల్లె అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నరికి దుంగలుగా తయారు చేశా డు. మొత్తం తొమ్మిది దుంగలుగా చేసి రాయుడు కాలనీ సమీపంలోని కంచాలమ్మ చెరువు వద్ద దాచాడు. వాటిని బెం గళూరుకు తరలించేందుకు షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి చెందిన కారును బాడుగకు మాట్లాడుకున్నాడు. ఒప్పందం ప్ర కారం మహమ్మద్ తన కారులో దుంగలు వేసుకుని బెంగళూరుకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరాడు. మార్గమధ్యంలో చిన్నమండెం దాటగానే కారు మ రమ్మతులకు గురైంది. ఇదే విషయాన్ని ఇమ్రాన్‌కు తెలిపి, మరో వాహనం మాట్లాడుకురావాల్సిందిగా సూచించా డు. అతను మరో వాహనాన్ని బాడుగకు మాట్లాడుకుని బయలుదేరాడు.
 
 రంగంలోకి దిగిన పోలీసులు
 ఎలాగోలా విషయం చిన్నమండెం పోలీసులకు తెలిసింది. ఎస్‌ఐ యోగీంద్రతో పాటు సిబ్బంది రాజగోపాల్‌రెడ్డి, గంగాధర్, అంజినాయక్, రఘునాథ, షాహుల్ అక్కడికి చేరుకున్నారు. రెండు వాహనాలతో పాటు ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల మాటలు విని ఇలా మోసపోయానని నిందితుడు ఇమ్రాన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement