అంగన్‌వాడీలకు ధీమా..

Beema To Anganwadi - Sakshi

కార్యకర్తలు, ఆయాలకు కేంద్ర  ప్రభుత్వం బీమా

ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆర్థిక సాయం

జిల్లాలో 6,458 మందికి లబ్ధి

ఆనందం వ్యక్తంచేస్తున్న అంగన్‌వాడీలు

అరకొర వేతనంతో అవస్థలు పడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇదో తీయని కబురు. కేంద్ర ప్రభుత్వ కరుణతో ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే బీమా సౌకర్యం లభించనుంది. వారిపైనే ఆధారపడిన కుటుంబానికి ఇదో ఆసరా కానుంది. జిల్లాలోని 6,458మందికి లబ్ధి చేకూరే ఈ పథకానికి సంబంధించి ఇంకా విధివిధనాలు వెలువడాల్సి ఉంది.

రామభద్రపురం(బొబ్బిలి) : సమగ్ర శిశు అభివృద్ధిలో శాఖలో గర్బిణులు, శిశువుల అభివృధ్ధికి పాటు పడుతున్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ఆ కేంద్రాల్లో సేవలందిస్తున్న కార్యకర్తలు, ఆయాలకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా వర్తింపజేయనుంది. ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిపేందుకు ధీమా కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ ఉన్నతాధికారుల ద్వారా అంగన్‌వాడీల సమగ్ర సమాచారం పంపించినట్టు అధికార సమాచారం.

జిల్లాలో 6,458 మందికి లబ్ధి..

జిల్లాలోని మైదాన ప్రాంతాల్లోని 12 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుండగా, ఐటీడీఏ పరిధిలో 5 ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2,987 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 742 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జీవిత బీమా పథకంతో  జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్న 6,458 మందికి లబ్ధి చేకూరనుంది.

వీరంతా గతంలో తక్కువ వేతనాలతో పనిచేశారు. ఇటీవలే ప్రభుత్వం వేతనాలు పెంచడంతో ప్రస్తుతం కార్యకర్తలకు రూ.10,500,  ఆయాలకు రూ.6వేల వేత నం అందనుంది. విధుల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించింది.

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనా(పీఎంజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనా(పీఎంఎస్‌బీవై)తో పాటు ప్రత్యేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలకోసం బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పధకాలకు అవసరమయ్యే ప్రీమియంను కేంద్రం, ఎల్‌ఐసీ సంయుక్తంగా భరించనున్నాయి.

2017 జూన్‌ 1నాటికి 18–50 ఏళ్ల లోపు ఆయాలు, కార్యకర్తలకు పీఎంజేబీవై కింద రూ.2లక్షల విలువైన జీవిత బీమా, 51–59 ఏళ్ల వారికి పీఎంఎస్‌బీవై కింద రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. 18 నుంచి 49 ఏళ్ల లోపు అంగన్‌వాడీలకు జీవిత బీమా పరిధిలోకి వస్తున్నారు గాని 50–59 ఏళ్ల లోపు అంగన్‌వాడీలు జీవితబీమా పరిధిలోకి రాకపోవడంతో వీరికోసం ప్రత్యేకంగా ఈ బీమా అమలు చేస్తోంది. ఈ పధకం కింద రూ.80 వేల జీవిత బీమా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

బీమా కల్పించడం హర్షణీయం..

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు బీమా సౌకర్యం కల్పిం చడం హర్షణీయం. ఎప్పటి నుంచో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మా కుటుం బాలకు ఎలాంటి భరోసా లేదు. రెండు లక్షల బీమాతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

– గేదెల రాధమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త, రామభద్రపురం

బీమాతో ఎంతో ప్రయోజనం...

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అమలు చేస్తున్న బీమా సౌకర్యం ఎంతో ప్రయోజనకరంగా ఉం టుంది. ప్రభుత్వం మరణిం చిన కార్యకర్తల కుటుం బాల కు ఏవిధమైన సౌకర్యాలు కల్పించడం లేదు. కాబట్టి ఈ బీమా వారి కుటుంబానికి ఉపయోగపడుతుంది. 

– జి.యర్రయ్యమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్, రామభద్రపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top