ఇద్దరు బీట్ గార్డ్స్ దారుణ హత్య | beat guards brutally murdered in guntur district | Sakshi
Sakshi News home page

ఇద్దరు బీట్ గార్డ్స్ దారుణ హత్య

Apr 9 2016 10:58 AM | Updated on Jul 30 2018 8:29 PM

అటవీ శాఖ విధులు నిర్వర్తిస్తున్న బీట్ గార్డ్స్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు.

బొల్లపల్లి: అటవీ శాఖ విధులు నిర్వర్తిస్తున్న బీట్ గార్డ్స్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం అనుమల చెరువు పంచాయతి పరిధిలోని పునుగులకుంట అటవీ ప్రాంతంలో శనివారం వెలుగు చూసింది. మృతి చెందిన వారిని లాజర్, షేక్ బాజిగా గుర్తించారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చే రుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement