చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

Balineni Srinivasa Reddy Clarifies That Deals Are Not Cancelled - Sakshi

సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన కంపెనీలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ముప్పులాంటిదంటూ వచ్చిన కథనాలు దుష్ప్రచారమేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల నుంచి విద్యుత్‌ కొనుగోలును నిలిపివేయలేదని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు నిర్దేశించిన విధంగా ఈఆర్‌సీ ఇ‍చ్చే నిర్ణయాలను అమలు చేస్తూ చట్టప్రకారం ముందుకు సాగుతాం. ప్రభుత్వం కేవలం సంప్రదాయేతర ఇంధనాన్ని సమకూర్చే సంస్థలకే కాదు.

ఇతర కరెంటు కంపెనీలకూ బకాయిలు పడింది. గడిచిన 16, 18 నెలలుగా రూ.18 వేల కోట్లపైబడి బకాయిలు ఉన్నాయి. తాను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వానికి పాపాలు అంటగడుతూ గురివింద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు విద్యుత్‌రంగం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. ఈ అప్పులు తీర్చడానికి రాయితీలతో కూడిన రుణాలు మంజూరుచేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత, పారదర్శక విధానాలను తీసుకువస్తున్నారు ఆయన నిర్ణయాలతో విద్యుత్‌ రంగానికి పునరుజ్జీవం వస్తుంద’ని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top