పీక కోస్తా.. కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna fires on fans in Hindupuram - Sakshi

సాక్షి, అనంతపురం : నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా.. ఇవి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని మరోసారిబయటపెట్టారు. ఈసారి సొంత కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ  ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుందంటూ అరిచాడు. మరో కార్యకర్త కూడా బాలయ్య ఈసారి 60 వేల మెజారిటీ అంటూ అరిచాడు.

హిందూపురంలో గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలంటూ అనుకరిస్తూ మరీ పక్కనే ఉన్న వసుంధరతో అన్నారు. బాలకృష్ణ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తుండగా వసుంధర నవ్వుతూ కనిపించారు. మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ చేష్టలపై హిందూపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

చదవండి : బాలకృష్ణ మరో నిర్వాకం.!

బాలయ్య హీరోనా... జీరోనా?

బాలకృష్ణ బూతు పురాణం

వైరల్‌: బుల్‌బుల్‌ బాలయ్య..!

బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top