బాలకృష్ణ మరో నిర్వాకం.! | Balakrishna Fires On TDP Activist In Hindupur  | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ మరో నిర్వాకం.!

Mar 30 2019 2:44 PM | Updated on Mar 30 2019 4:00 PM

Balakrishna Fires On TDP Activist In Hindupur  - Sakshi

తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌పై.. 

సాక్షి, అనంతరంపురం : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇటీవల ఓ మీడియా జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించి అబాసులపాలైన బాలయ్య.. తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలయ్యను.. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య.. రవికుమార్‌ను తోసేశారు. బయటకు పంపాలని పోలీసులను ఆదేశించగా..వారు అతన్ని అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్‌ వెంటనే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇక్బాల్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

బాలకృష్ణ వైఖరిపై సొంతపార్టీ కార్యకర్తలే విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించిన బాలయ్య.. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్‌ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు. ఈ దృష్యాలన్నీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. గతంలో బాలయ్య సొంత పార్టీ కార్యక్తలపైనే చేయి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

చదవండి : బాలకృష్ణ బూతు పురాణం

వైరల్‌: బుల్‌బుల్‌ బాలయ్య..!

బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement