కారులో నుంచి జారిపడి విద్యార్థి మృతి | B.Tech student dies in freak accident | Sakshi
Sakshi News home page

కారులో నుంచి జారిపడి విద్యార్థి మృతి

Oct 26 2015 6:44 PM | Updated on Apr 3 2019 7:53 PM

కారులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి విద్యార్థి మృతి చెందాడు.

చాట్రాయి (కృష్ణా జిల్లా) : కారులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన వెల్లూరి హరికృష్ణ(22) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తన సహ విద్యార్థి రంజిత్ వివాహం కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో జరుగుతుండటంతో  ఆదివారం వివాహానికి హాజరయ్యాడు.

వివాహం అనంతరం సోమవారం సాయంత్రం సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయర్ను చూడటానికి స్నేహితులతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో కారు ముందు డోరు సరిగ్గా పడకపోవడంతో.. ప్రమాదవశాత్తూ అందులో నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్నేహితులు అతన్ని చింతలపూడి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్థారించారు.

Advertisement
 
Advertisement
Advertisement