టీడీపీకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు | Avanthi Srinivas At AP Assembly Mediapoint | Sakshi
Sakshi News home page

సమావేశాల్లో 19 కీలక బిల్లులు ఆమోదించాం: అవంతి శ్రీనివాస్‌

Jul 30 2019 5:00 PM | Updated on Jul 30 2019 5:55 PM

Avanthi Srinivas At AP Assembly Mediapoint - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష పార్టీకి సమాన హక్కులు, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ..  ఈ అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. అన్ని వర్గాలకు మంచి జరగాలని కీలక బిల్లులు ఆమోదించామన్నారు. రాబోయే రోజుల్లో అవినీతి రహిత పాలన ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వైఖరి సమంజసంగా లేదన్నారు. టీడీపీకి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు.

19 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించామని ప్రభుత్వ విప్‌ శ్రీనివాసులు అన్నారు. గతంలో ప్రతిపక్షం గొంతు నొక్కారు.. కానీ తాము ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇచ్చామని తెలిపారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement