రెండేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
ధవళేశ్వరం : రెండేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముస్లింవీధిలోని ఓ రెండేళ్ల బాలిక శనివారం ఇంటిబయట ఆడుకుంటుండగా, సమీపంలో నివసిస్తున్న కుంది అప్పారావు ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. పాపకు స్నానం చేయించేందుకు ఆమె తల్లి చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. అప్పారావు బాలికను తీసుకువెళ్లినట్టు మరో యువకుడు చెప్పడంతో అక్కడకు వెళ్లిన తల్లికి అప్పారావు లైంగిక దాడికి యత్నించడం కనిపించింది. దీంతో అతని వద్ద నుంచి బాలికను లాక్కుని తీసుకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధవళేశ్వరం సీఐ శివాజీరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.