జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్ | Assistant Setting Manager arrested for molesting junior artist | Sakshi
Sakshi News home page

జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్

Nov 15 2013 5:01 PM | Updated on Aug 28 2018 4:30 PM

జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్ - Sakshi

జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్

టాలీవుడ్లో కలకలం సృష్టించిన జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుణ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

టాలీవుడ్లో కలకలం సృష్టించిన జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచారయత్నం కేసులో నిందితుణ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సెట్టింగ్స్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సురేష్ గురువారం రాత్రి హైదరాబాద్ రహమత్ నగర్లోని జూనియర్ ఆర్టిస్ట్ (22) నివాసానికి వెళ్లి అత్యాచారానికి ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మద్యం మత్తులో ఉన్న  సురేష్ ఈ సంఘటన అనంతరం పక్కనే మరో వివాహిత ఇంటికి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వార్త శుక్రవారం ఉదయం బయటకు రావడంతో ఫిలింనగర్లో కలకలం చెలరేగింది.

Advertisement
 
Advertisement
Advertisement