రాష్ట్ర శాసనసభ గురువారానికి వాయిదా పడింది. తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగనుంది.
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ గురువారానికి వాయిదా పడింది. తెలంగాణ బిల్లుపై చర్చ కొనసాగనుంది. సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు. బుధవారం జరిగిన చర్చ గందరగోళంగా సాగింది. సాయంత్రం కిరణ్ మాట్లాడారు.
ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం గడువు ఇచ్చేందుకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.