మోహన్‌ లాల్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే.. ఆ సినిమా వాయిదా! | Malayalam Superstar Mohan Lal Vrusshabha Movie New Release Date Announced, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vrusshabha Release Date: మోహన్ లాల్ వృషభ.. ఈ సారైనా రిలీజవుతుందా?

Nov 7 2025 5:02 PM | Updated on Nov 7 2025 5:49 PM

mohan lal new movie Vrusshabha new release date

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ దీపావళికి రిలీజ్‌ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏమైందో గానీ విడుదల వాయిదా వేశారు.

ఆ తర్వాత మరో డేట్‌ను రివీల్ చేశారు. నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఈ డేట్‌లో కూడా రిలీజ్‌ చేయలేదు. తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. ఇక  ఈ ఏడాది క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఓ వీడియోను పంచుకున్నారు. ఈ డేట్‌లోనైనా రిలీజ్‌ కానుందా? లేదంటే మళ్లీ సంక్రాంతికి పోస్ట్‌పోన్‌ అవుతుందా? అనేది తెలియాలంటే క్రిస్‌మస్‌ వరకు ఆగాల్సిందే.

కాగా.. ఇ‍ప్పటికే రిలీజైన టీజర్‌ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement