
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తామన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. తాను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానానని వైఎస్ జగన్ తెలిపారు. ఇదేస సమయంలో పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రైవేటీకరణపై అన్నిరకాల పోరాటం చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేస్తాం. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాలుగా పోరాడుతాం. నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం. అయినా బరి తెగిస్తే.. ఊరుకోం. ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండి
ప్రతిపక్ష హోదాపై..
18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీనే. మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతాం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వడం లేదు. గతంలో సభలో జరగిని దాడికి చంద్రబాబు ఏడ్చేసి నానా యాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు.
ఎన్నికల విషయమై..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
