
సాక్షి,తాడేపల్లి: ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్ అంటూ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుమ్మెత్తిపోశారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ డాటర్ సెంటర్‌కు బీజం వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డాటా సెంటర్ ఇది. వేరే వాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు..అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డాటా సెంటర్‌పై వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి.
మద్యం ఇకపై అమ్మేటప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అసలు ఆ షాప్‌లు ఎవరి చేతుల్లో ఉన్నాయి. అవి చంద్రబాబు చేతుల్లోనే కదా? అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు కాదా?. మరి అలాంటప్పుడు ఎవరు స్కాన్ చేసేది?.అంటూ మద్యం అమ్మకాలు,కల్తీ మద్యంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన,వైఎస్సార్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ వైఎస్ జగన్‌ను స్పందన కోరారు. అందుకు వైఎస్ జగన్ ఏమన్నారంటే? ఈ లింక్ క్లిక్ చేయండి
ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నాంటూ దుయ్యబట్టారు. ఇలా ఉద్యోగుల్నే కాదు రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు చేస్తున్న మోసాల్ని వైఎస్ జగన్ కళ్లకు కట్టినట్లు చూపించారు. చంద్రబాబు మోసాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి
హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బిల్డప్ ఇస్తారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారింది. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం. ‘ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ అంటూ హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు ఇస్తున్న బిల్డప్‌ను బయటపెడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో సంవత్సరాలతో సహా వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి తీరుతెన్నులపై వైఎస్ జగన్ ఏమన్నారో ఈ లింక్ క్లిక్ చేసిన చూడండి.