'శాసనసభ నాకు దేవాలయం లాంటింది'

'శాసనసభ నాకు దేవాలయం లాంటింది' - Sakshi


హైదరాబాద్: శాసనసభ తనకు దేవాలయం లాంటిదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల పట్ల సమభావంతో వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ప్రతిపార్టీ, సభ్యుడు నియమనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా కోడెల తెలిపారు. శాసన సభ్యులు సరిగా నడుచుకోకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఆ రకంగా సభ, సభ్యుల ప్రతిష్టకు భంగకరంగా ఉంటుందన్నారు. దీనికోసం నా కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తానని కోడెల తెలిపారు.గత అనుభవాలను పరిశీలిస్తే కొన్నిసార్లు గాడి తప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలే కాదని,సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు.అలా ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

 


సోమవారం  సభా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించపోగా, నేటి సభలో సగ భాగం సమావేశాలు నిలిచిపోయాయన్నారు. దీనివల్ల ప్రజలకు నష్టం, అందరూ సహకరించాలన్నారు.హైదరాబాద్‌లో ఇవే చివరి సమావేశాలని తాను ఎప్పుడూ అనలేదన్నారు. శాసనసభ ప్రజలకు చేరువగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు మాత్రమే సభలో చెప్పానన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top