ఆర్టీసీలో ఇక కాంట్రాక్ట్ విధానం రద్దు | apsrtc recruitment regulations | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఇక కాంట్రాక్ట్ విధానం రద్దు

Dec 7 2013 4:46 PM | Updated on Aug 20 2018 3:26 PM

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దుచేస్తూ  ప్రభుత్వం  శనివారం ఆదేశాలు జారీ చేసింది.  ఇక నుంచి టైమ్‌స్కేల్‌ ప్రతిపాదికన నియామకాలు చేపట్టాలని సీఎస్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానం రద్దుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించారని, భవిష్యత్లో రెగ్యులర్ విధానంలోనే నియామకాల కోసం ఆర్టీసీ ఎండీకి...సీఎస్ సర్కులర్ పంపారని వారు  వెల్లడించారు.  కాంట్రాక్ట్ విధానం రద్దు నిర్ణయం తీసుకున్నందుకు టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement