విధుల్లో ఆర్టీసీ కండక్టర్లు

APSRTC Conductors Duty on Coronavirus Awareness YSR Kadapa - Sakshi

రాజంపేట: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని శాఖల సేవలను వినియోగించుకుంటోంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కండక్టర్లను వినియోగించుకుంటోంది. 560 మందిని వారి సొంత ప్రాంతాల్లోని పోలీసుశాఖకు అటాచ్‌ చేశారు. శుక్రవారం రాజంపేట డిపో పరిధిలోని నందలూరుకు చెందిన 13 మంది కండక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్‌కు అటాచ్‌ చేశారు. వీరికి స్ధానిక ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి కరోనా కట్టడికి సంబంధించిన విధులు, ప్రాంతాలను కేటాయించారు.

జిల్లాలో డిపోల వారీగా..
జిల్లాలో డిపోల వారీగా రాజంపేటలో 90, కడప 90, ప్రొద్దుటూరు 100,రాయచోటి 100, జమ్మలమడుగు 70,పులివెందుల 60,మైదుకూరు 50 మంది కండక్టర్లను కరోనా వైరస్‌ నివారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జీవీనరసయ్య ‘సాక్షి’మాట్లాడుతూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top