ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్‌మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్‌మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష జిల్లా కేంద్రాలలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్‌లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని, హాల్‌లోకి వచ్చిన వారు 12.30 గంటల వరకు బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఓఎమ్‌ఆర్ షీట్లను బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నమూనా ఓఎంఆర్ షీట్లను నెట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.