ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష లు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రాక్టికల్ పరీక్షలు 26 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,146 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్ విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ ద్వారా గానీ, ఏపీఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ ద్వారా గానీ ఈ నెల 10 వరకు హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు.
పరీక్షల నిర్వహణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా స్థాయిలో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలనూ నియమించామన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి పరిశీలకులను కూడా నియమించామన్నారు. పరీ క్షలు మొదలైన తర్వాత కేవలం 15 నిముషాల వరకే అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.