ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని! | Apkab chairman pinnamaneni! | Sakshi
Sakshi News home page

ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని!

Apr 10 2015 12:25 AM | Updated on Jul 28 2018 6:35 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) నూతన పాలక మండలి ఎన్నిక శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.

  • సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) నూతన పాలక మండలి ఎన్నిక శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికల అధికారి తేజోమయి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత డెరైక్టర్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉండడంతో ఆ పార్టీకి చెందిన డెరైక్టరే అధ్యక్ష పోస్టుకు ఎన్నికయ్యే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధ్యక్ష పదవికి కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నిక  కానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు  ఆమోదముద్ర వేశారు. గుంటూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు.
     
    ఏమిటీ శిక్ష?: ముమ్మనేని ఆవేదన

    పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో వెనకబడిపోయానని, నిజంగా చెప్పాలంటే తాను రాజకీయంగా చచ్చిపోయినట్టేనని ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన ముమ్మనేని వెంకటసుబ్బయ్య తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement