బైక్‌ కోసం టవరెక్కాడు..

Aperson Climed Hightension Tower For Bike - Sakshi

సాక్షి,అడ్డగూడూరు : తల్లిదండ్రి తనకు వెంటనే బైక్‌ కొనివ్వాలని ఓ యువకుడు హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ సృష్టించాడు. ఈ ఘటన మండల పరిధిలోని మానాయికుంటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య కుమారుడు బోడ నరేష్‌ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బైక్‌ కొనివ్వాలని కొంతకాలంగా తల్లిదండ్రిని వేధిస్తున్నాడు. వారు అందుకు ఒప్పుకోకపోవడంతో మన్తాపానికి గురయ్యాడు.

ఈ నేపథ్యంలోనే గ్రామ పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. తనకు బైక్‌ కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిం చాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని నరేష్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. దీంతో తండ్రి నర్సయ్య కలుగజేసుకుని బైక్‌ కొనిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top