‘సీఎం జగన్‌కు మహిళల తరపున కృతజ్ఞతలు’

AP Women Thanked CM YS Jagan Over Disha Law - Sakshi

సాక్షి, తాడేపల్లి : దిశ చట్టం తెచ్చిన తర్వాత మహిళలకు ఒక భరోసా కలిగిందని, అతి తక్కువ రోజుల్లో మహిళా బాధితులకు న్యాయం జరుగుతోందని సచివాలయ ఉద్యోగి శ్రావణి సంతోషం వ్యక్తం చేశారు. దిశ చట్టం తెచ్చినందుకు మహిళల తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేశారు. తన తోటి మహిళలకు తాను రక్షణ కల్పించడం ఆనందంగా ఉందన్నారు. మద్య నిషేధం అమలు చేస్తున్నందుకు మహిళల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు జేశారు. ‘ మీ లాంటి సీఎం ఇంతకు ముందు లేరు.. ఇకపై వస్తారనే నమ్మకం లేదు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

సోమవారం  రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు : లీలా కృష్ణ
‘‘ పాదయాత్రలో ప్రతి ఆటో కార్మికుడికి అండగా ఉంటామని జగనన్న మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వాహనమిత్ర పథకం ప్రకటించి అందరికీ అండగా ఉన్నారు. ఆటో కార్మికులందరికీ అండగా ఉన్న మీకు కృతజ్ఞతలు’’ 

సీఎం జగన్ పాలనలో జవాబుదారీతనం పెరిగింది : మంచో విన్సెట్ ఫెర్రర్‌
‘‘ ప్రజల కష్టాలను దగ్గరగా గుర్తించి సీఎం జగన్‌ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మార్పు కనిపిస్తుంది. ఆయన పాలనలో జవాబుదారీతనం పెరిగింది.’’ 

ప్రతీ ఒక్కరికి భరోసా ఇచ్చారు : పుష్పకుమారి
‘‘ కరోనా కష్టకాలంలో కూడా వలస కూలీలను ఆదుకున్నందుకు ధన్యవాదాలు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.’’ 

ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు: డీబీ సరోజ
‘‘గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పట్ల గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు ఇంటి వద్దనే అందిస్తున్నాం. ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది.’’

గ్రామ స్వరాజ్యం రాబోతోంది : ఆర్‌డీటీ కార్యకర్త
‘‘గ్రామ స్వరాజ్యం రాబోతోంది. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.’’ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top