YS Jagan React on AP Election Results 2019 | ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం : వైఎస్‌ జగన్‌ - Sakshi
Sakshi News home page

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం : వైఎస్‌ జగన్‌

May 23 2019 11:15 AM | Updated on May 23 2019 11:53 AM

This is Ap people Success says YS Jagan mohan reddy - Sakshi

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.

సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. కాగా, ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ జగన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో స్పందించారు.

'వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్‌బుక్‌పేజీలో పోస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement