ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల | AP LAWCET 2016 result declared | Sakshi
Sakshi News home page

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

Jun 10 2016 6:14 PM | Updated on Mar 28 2019 5:35 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం ఎస్కేయూలోని పాలకభవనంలో విడుదల చేశారు.

అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్ ఫలితాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం ఎస్కేయూలోని పాలకభవనంలో విడుదల చేశారు. ఏపీ లాసెట్‌ను మే 28న నిర్వహించారు. మొత్తం 10,499 మంది హాజరుకాగా , 9,841(93.73 శాతం) మంది ఉత్తీర్ణులైనారు.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 7,914 మంది హాజరుకాగా 7,556 మంది (95.12 శాతం), ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 2,033 మంది హాజరుకాగా 1,770 మంది (87.06 శాతం), ఎల్‌ఎల్‌ఎం (పీజీ కోర్సు) ప్రవేశ పరీక్షకు 522 మంది హాజరుకాగా 515 మంది (98.66 శాతం ) అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే 8 శాతం ఉత్తీర్ణత పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement